Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫ్యాన్స్ కు బండ్ల గణేశ్ అద్భుతమైన సూచన

బండ్ల గణేశ్.. చిన్నచిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసి.. పెద్ద హీరోలతో భారీ చిత్రాలు చేసే స్థాయికి ఎదిగిన బడా నిర్మాత. ఆయన మాటలు చాలా చిత్రంగా ఉంటాయన్నది.. ఆడియో ఫంక్షన్లలో బండ్ల పలుకులు విన్నవాళ్ళు చెప్పేమాట. 'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ఆడియో రిలీజ్ లోనూ గణేశ్ తనదైన శైలిలో నవ్వులు పంచారు. అంతేగాకుండా, ఫ్యాన్స్ కు అద్భుతమైన సలహా కూడా ఇచ్చారు.

తాను, చిరంజీవిని చూడ్డానికి హైదరాబాద్ వచ్చి నటుణ్ణి అయ్యానని తెలిపాడు. 2006లో షాద్ నగర్ లో సొంత ఇల్లు కట్టుకుని, చిరంజీవిని ఆహ్వానించానని, ఆయనకు వెన్నునొ్ప్పి బాధిస్తున్నా, గృహప్రవేశానికి వచ్చారని చెప్పాడు. మాటపై నిలబడే ఇలాంటి ఫ్యామిలీని వదలకూడదని అప్పుడే నిర్ణయించుకున్నానని గణేశ్ వెల్లడించాడు. మీరు కూడా మెగా ఫ్యామిలీని నమ్ముకుంటే మీలో ఎవరో ఒకరు నాలాగా బడా నిర్మాత అవుతారని ఫ్యాన్స్ కు సూచించాడు బండ్ల గణేశ్. ఇక తమ కులదైవం సాంబశివుడైతే.. తన దైవం పవన్ కల్యాణ్ అని గణేశ్ తన విధేయత చాటుకున్నాడు.

More Telugu News